హైదరాబాద్ లో చెట్లు కొట్టినందుకు 53,900 ఫైన్ విధించిన అధికారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 28, 2020

హైదరాబాద్ లో చెట్లు కొట్టినందుకు 53,900 ఫైన్ విధించిన అధికారులు

హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి అటవీ శాఖ భారీ ఫైన్ విధించింది.నుమతి లేకుండా చెట్లు కొట్టేసినందుకు ఫైన్ విధించడం జరిగింది .  కొట్టేసిన చెట్లకు రెట్టింపు మొక్కలు నాటాలనిఆదేశాలుజారీ చేసింది . అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని ‘ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్’ గేటెడ్ కమ్యూనిటీలో అనుమతి లేకుండా సుమారు 40 చెట్లు కొట్టివేశారు. ఇది అటవీ శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. మేడ్చల్ జిల్లా అటవీ అధికారి సుధాకర్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలిని పరిశీలించారు. వాల్టా చట్టం అతిక్రమణ కింద అటవీ అధికారులు అపరాధ రుసుం విధించారు. బదులుగా చెట్లు నాటాలని స్పష్టం చేశారు. బాధ్యులపై రూ.53,900 జరిమానా విధించారు. కొట్టిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి సంరక్షించాలని శరతు పెట్టారు.కమ్యూనిటీలో అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. కొట్టేసిన చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేశామని చెప్పారు. అయితే.. అధికారుల దర్యాప్తులో అది శాస్త్రీయంగా జరగలేదని వెల్లడైంది. దీంతో చర్యలు తీసుకున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )