గూగుల్ ప్లే స్టోర్ నీయుడి 600 యాప్స్ ని తొలగించిన గూగుల్ సంస్థ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 21, 2020

గూగుల్ ప్లే స్టోర్ నీయుడి 600 యాప్స్ ని తొలగించిన గూగుల్ సంస్థ

 గూగుల్ ప్లే స్టోర్ ఇలాంటి 600 యాప్స్ పట్ల కఠినంగా వ్యవహరించింది. ఈయాప్స్ ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ప్రకటనల విషయంలో ఈ యాప్స్ తమ నిబంధనలను అతిక్రమించాయని అందుకే ఈ చర్య తీసుకున్నామంటోంది గూగుల్.యాప్స్ ను ఉపయోగించని సమయంలో, కాల్స్ చేస్తున్న టైంలో, వెబ్ వాడుతున్నప్పుడు స్క్రీన్స్ పై యాడ్స్ కనిపిస్తుండడం, విసిగిస్తుండడం కస్టమర్లు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో గూగుల్ వీటిపై వేటు వేసింది. గతంలో కోర్టు ఆదేశాలతో కొన్నాళ్ళు పాటు టిక్ టాక్ యాప్ ని తన ప్లే స్టోర్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. గూగుల్ నిర్ణయం పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.




( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )