68 శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలను మూయించేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు ఆదేశాలు జారీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

68 శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలను మూయించేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు ఆదేశాలు జారీ

ప్రైవేట్ కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో దాఖలైంది. ముఖ్యంగా శ్రీచైతన్య నారాయణకు సంబంధించిన జూనియర్ కాలేజీల్లో సరైన భద్రత లేదని ఫైర్ సేఫ్టీ, పరిశుభ్రతను పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పిల్‌ దాఖలైంది. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిల్‌లో పిటిషనర్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 17న విచారణ చేసిన ధర్మాసనం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల మధ్య ఏదైనా సమ్మతి కుదిరిందా అనే అనుమానం సైతం వ్యక్తం చేసింది. ఫిర్యాదులు అందినప్పటికీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ అనుమానం వ్యక్తం చేసింది న్యాయస్థానం. అంతేకాదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ నుంచి గుర్తింపు లేకుండానే శ్రీ చైతన్య , నారాయణ సంస్థలు 29800 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు.పలు ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కాలేజీలపై తెలంగాణ హైకోర్టు కన్నెర్ర చేసింది. ముఖ్యంగా శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలపై కోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే 68 శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలను మూయించేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలో జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారణ చేసింది. మార్చి 28 తర్వాత అంటే విద్యార్థులకు ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయిన తర్వాత శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )