మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్ల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 17, 2020

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్ల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. సుమారు 6 గంటల పాటు కేబినెట్ భేటీ సాగింది. ఇందులో పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి నిర్వహణపై కీలక చర్చలు జరిగాయి. సీఏఏకు వ్యతిరేక తీర్మానం చేయాలని కూడా నిర్ణయించారు.
జీహెచ్ఎంసీకి నెలకు రూ.78 కోట్ల చొప్పున, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్ల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించి నిధులు జనాభా ప్రాతిపదికన అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండే అవకాశం లేదు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811 కోట్లలో రూ.500 కోట్లు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించేలా నిర్ణయించారు.




( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )