తెలంగాణా రాష్ట్రంలో 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 23, 2020

తెలంగాణా రాష్ట్రంలో 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ


తెలంగాణా రాష్ట్రంలో 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రోజు ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో భేటీ అయిన విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు లేని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఇక హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గుర్తింపు లేని ఇంటర్ కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు పేర్కొన్నారు.ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులేని 79 కళాశాలలను గుర్తించి నోటీసులు ఇచ్చామని,మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు . కాలేజీల యాజమాన్యాల నుంచి స్పందన రాకుంటే వాటిని మూసివేస్తామని హెచ్చరించారు. కచ్చితంగా అనుమతులు తీసుకుని, నిబంధలన ప్రకారం కళాశాలలు నడిపించాలని లేదంటే కచ్చితంగా కళాశాలలు మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు.. ఇక హైకోర్టు అనుమతులు లేని కాలేజీలపై చర్యలు తీసుకోమని చెప్పిందనిఈ నెల 25 తేదీ లోపు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఇంటర్ బోర్డు కార్యదర్శి కాలేజీ యాజమాన్యాలు సహకరించాలని అన్నారు. కొన్ని కాలేజీలకు అగ్నిమాపక అనుమతి లేదని, మరికొన్ని కాలేజీలు ఓ చోట అనుమతి తీసుకుని, అదే పేరుతో అనుమతి లేకుండా మరోచోట నడుపుతున్నారని చెప్పారు. ఇక అనుమతులు లేని, అడ్రెస్ మార్చిన , విద్యార్థులకు వసతి సరిగా లేని, ఫైర్ సేఫ్టీ లేని కళాశాలలకు చెక్ పెట్టే పనిలో ఉన్నారు ఏపీ ఇంటర్ విద్యా శాఖాధికారులు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )