ఏకగ్రీవమైన 9 డీసీసీబీ డైరెక్టర్ల పదవుల ఎన్నికలు :వెల్లడించిన రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

ఏకగ్రీవమైన 9 డీసీసీబీ డైరెక్టర్ల పదవుల ఎన్నికలు :వెల్లడించిన రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ


తెలంగాణ రాష్ట్రంలోని  కేంద్ర సహకారబ్యాంకులుకు , తొమ్మిది జిల్లా కో- ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సంస్థ ల డైరెక్టర్ల పదవులన్నీ ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ ప్రకటించింది. ఇందులో నల్లగొండ జిల్లాలో ఒక్కస్థానం మినహా మిగిలిన అన్ని డైరెక్టర్‌ పదవులు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకే దక్కాయి. ఒక్కొక్క డీసీసీబీలో 20 (గ్రూప్‌ ఏలో 16, గ్రూప్‌ బీలో 4), ఒక్కొక్క డీసీఎంస్‌లో 10 చొప్పున డైరెక్టర్‌ పదవుల భర్తీకి మంగళవారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదలచేసి, నామినేషన్లు స్వీకరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణకు అవకాశమిచ్చారు. కొన్నిచోట్ల డైరెక్టర్‌ పదవికి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేసినప్పటికీ, ఉపసంహరణ గడువు ముగిసేసరికి అన్నిచోట్లా ఒక్కొక్కరే  పోటీలో మిగిలారు. తొమ్మిది డీసీసీబీలలో మొత్తం 180 డైరెక్టర్‌ పదవులుండగా, 147 పదవులకు ఒక్కొక్క నామినేషనే దాఖలైంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలోని మరో 33 డైరెక్టర్‌ పదవులకు అభ్యర్థులు  లేకపోవడంతో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలుకాలేదు. దీంతో డీసీసీబీలలో 147 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవమైనట్టు అధికారులు వెల్లడించారు.  తొమ్మిది డీసీఎంఎస్‌లలోని మొత్తం 90 డైరెక్టర్‌ పోస్టులకు నామినేషన్లు స్వీకరించగా 74 పోస్టులకు ఒక్కొక్కరే నామినేషన్‌ దాఖలుచేశారు. రిజర్వేషన్‌ క్యాటగిరీలోని మరో 16 డైరెక్టర్‌పదవులకు ఆయా అభ్యర్థులు లేకపోవడంతో ఒక్క నామిషనేషన్‌ కూడా దాఖలుకాలేదు. దీంతో డీసీఎంఎస్‌లలో 74 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )