ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికల్లో 747 పీఏసీఎస్ ల్లోని 3388 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 6248 వార్డుల డైరెక్టర్ పదవుల కోసం ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో 14,530 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 9,11,599 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని చోట్లా ఓట్ల లెక్కింపుతోపాటు ఫలితాల ప్రకటన కూడా పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు సహకార శాఖ ప్రకటించింది. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులకు విజయాన్ని కట్టబెట్టిన రైతులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 90శాతానికి పైగా సొసైటీలను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారని, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు పూర్తిగా టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారని తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )