92వేల కోట్ల బకాయిలను ఎగ్గొట్టాలనే యోచనలో ఎయిర్టెల్ , ఐడియా , వోడాఫోన్ ... ఈరోజు రాత్రి వరకు కట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంటెలికాం సంస్థలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రం ప్రభుత్వం కఠిన చర్య తీసుకున్నది. బాకీలను 90 రోజుల్లో చెల్లించాలని గత ఏడాది అక్టోబర్‌లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 24వ తేదీ వరకు ఆ ఆదేశాలు ముగిశాయి. కానీ టెలికాం కంపెనీలు బాకీ డబ్బులు చెల్లించలేదు. దీంతో కోర్టు సీరియస్ అయ్యింది. భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలికమ్యూనికేషన్స్ సంస్థలన్నీ శుక్రవారం రాత్రి కల్లా బాకీలు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.ఈ ఆదేశాలకు సంబంధించిన నోటీసులను ఆయా జోనల్ కేంద్రాలకు టెలికమ్యూనికేషన్ శాఖ జారీ చేస్తున్నది. ఇవాళ రాత్రి లో గా 92వేల కోట్ల బకాయిలను చెల్లించాలని టెలికాం సంస్థలకు టెలికాంశాఖ ఆదేశించింది.
ఇవాళ ఉదయం టెలికాం సంస్థలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. టెలి సంస్థలు సుమారు 1.5 లక్షల కోట్ల బాకీ చెల్లించకపోవడాన్ని సుప్రీం తప్పుపట్టింది. భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలికమ్యూనికేషన్స్ సంస్థలకు సుప్రీం సమన్లు జారీ చేసింది. ఆయా కంపెనీలు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీం పేర్కొన్నది. మార్చి 17వ తేదీ ఆ కంపెనీల డైరక్టర్లు కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ ఆదేశించింది. ఇప్పటి వరకు ఏజీఆర్‌కు సంబంధించిన బాకీల నుంచి టెలికాం కంపెనీలు నయా పైసా కూడా చెల్లించలేదని జస్టిస్ మిశ్రా ఆవేశంగా అన్నారు. ఇంత అర్థంలేని వ్యవస్థను ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని జస్టిస్ మిశ్రా ఊగిపోయారు. టెలికాం సంస్థల బాకీల గురించి తనను అడగాల్సిన అవసరం లేదని టెలికాంశాఖ అధికారి అటార్నీ జనరల్‌కు రాసిన లేఖను కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. టెలీ సంస్థల నుంచి డబ్బులు వసూల్ చేయరాదు అని శాఖాధికారి ఎలా ఆదేశాలు ఇస్తారని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం ఆదేశాలను ఓ డెస్క్ ఆఫీసర్ ఎలా అడ్డుకుంటారని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. డబ్బు ఉందన్న అధికారంతో ఆ డెస్క్ ఆఫీసర్ ఇలా చేశారని, లేదంటే కోర్టు ఆదేశాలను ఎలా అడ్డుకుంటారని మిశ్రా అన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )