టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ ADE డి.కోటేశ్వర్‌రావును సస్పెండ్‌ చేసిన సంస్థ అధికారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 20, 2020

టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ ADE డి.కోటేశ్వర్‌రావును సస్పెండ్‌ చేసిన సంస్థ అధికారులు

రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌)లో కాంట్రాక్టు పనుల అప్పగింత తీరును ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్‌బుక్‌’తో పాటు న్యూస్ పేపర్లలో ప్రకటనలు చేసిన ADE డి.కోటేశ్వర్‌రావును సస్పెండ్‌ చేస్తున్న ట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తరపున రెండు రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.వాటిలో పేర్కొన్న వివరాల ప్రకారం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయం హెచ్‌ఆర్‌ విభాగం ఏడీఈ డి.కోటేశ్వర్‌రావు ఇటీవల సంస్థ ద్వారా రూ.30 కోట్లు విలువ చేసే 4,769 ట్రాన్స్‌ఫార్మర్‌ కంచె పనులకు ప్రదీప్‌ ఎలక్ట్రానిక్స్‌ అనే కాంట్రాక్టరుకు అప్పగించడాన్ని ప్రశ్నించారు. రేట్లను పెంచుతూ వాటిని అప్పగించడంపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్‌బుక్‌’లో సుదీర్ఘ ప్రసం గాన్ని పోస్ట్‌ చేస్తూ, సంస్థకు చెందిన కొందరు ఇంజనీర్లపై ఆరోపణలు చేశారు. దీనిపై సంస్థ యాజమాన్యం మౌనం వహించడాన్ని ప్రశ్ని స్తూ చేసిన ప్రకటన ప్రచురితమైంది. ఇలా సంస్థ నియమావళిని ఉల్లంఘించారని భావి స్తూ కోటేశ్వర్‌రావును సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అభియోగాలు అమల్లో ఉన్నంత కాలం ఏడీఈ కోటేశ్వర్‌రావు హెడ్‌క్వార్టర్‌ను అనుమతి లేకుండా విడిచి వెళ్లరాదని ఆదేశించారు.




( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )