దేశ విద్యారంగంలో సంచలన నిర్ణయం తీసుకున్న AICTE - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

దేశ విద్యారంగంలో సంచలన నిర్ణయం తీసుకున్న AICTE

దేశ వ్యాప్తంగా 2020–21 విద్యా సంవత్సరం కోసం జారీ చేసిన సాంకేతిక విద్యా సంస్థల అప్రూవల్‌ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేర్పులపై ఇటీవల ఢిల్లీ, చెన్నైలో జరిగిన కన్సల్టేషన్‌ సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా వచ్చే రెండేళ్లు అనుమతి ఇవ్వమని చెప్పిం ది. 2019–20 విద్యా ఏడాదిలో దేశంలోని విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ సీట్లు 27 లక్షలు ఉంటే అందులో 14 లక్షల సీట్లు మిగిలిపోయాయని, 13 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలోనూ 217 కాలేజీల్లో 1,12,090 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలుపగా, రాష్ట్రంలోని వర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో 62,744 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 55.97% సీట్లు భర్తీకాగా 44.03% సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. ఫార్మసీలోనూ ఇలాంటి పరిస్థి తే నెలకొంది. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి ఉండటంతో ఇంజనీరింగ్, ఫార్మసీలో వచ్చే రెండేళ్లపాటు కొత్తగా ప్రైవేటు కాలేజీలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )