తెలంగాణ ఎంసెట్ స్కామ్. చైతన్య ,నారాయణ కాలేజీ సిబ్బంది అరెస్ట్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 30, 2020

తెలంగాణ ఎంసెట్ స్కామ్. చైతన్య ,నారాయణ కాలేజీ సిబ్బంది అరెస్ట్....

తెలంగాణ సంచలనం సృష్టించిన ఎంసెట్ స్కాంలో సీఐడి అధికారులు మరో ముందడుగు వేశారు. ఈ స్కాంలో కార్పోరేట్ కాలేజీల హస్తముందని ముందునుండి అనుమానిస్తూ వస్తున్న అధికారులు కొన్ని కాలేజీల సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత విద్యాసంస్థలుగా వెలుగొందుతున్న నారాయణ, చైతన్య కాలేజీలకు చెందిన తొమ్మిదిమంది సిబ్బందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.2016 లో జరిగిన ఈ స్కామ్పై విచారణ చేపడుతున్న సీఐడీ దర్యాప్తును పూర్తిచేసింది. పూర్తి ఆధారాలతో నాంపల్లి కోర్టులో చార్జీషీట్ కూడా దాఖలుచేసింది. ఈ కేసుతో సంబంధమున్న 90 మంది నిందితులను చార్జీషీట్ లో చేర్చింది సీఐడీ. ఇందులో ముగ్గురు నిందితులు మ్రుతి, కమలేష్, జితేందర్ లు కూడా వున్నారు.ఇప్పటివరకు 64 మంది నిందితుల అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది. ఇందులో పలు ప్రైవేట్ కాలేజీల ప్రమేయమున్నా నారాయణ, చైతన్య కాలేజీల పాత్ర ముఖ్యమైందని పేర్కొన్నారు. త్వరలో నాంపల్లి కోర్టులో ట్రయల్స్ ప్రారంభమవుతాయని... పూర్తి ఆధారాలను చార్జీషీట్ లో పేర్కొన్నట్లు సీఐడీ అధికారలు వెల్లడించారు.
దీంతో ఇప్పటివరకు విచారణ కొనసాగిన ఈ ఎంసెట్ స్కాం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో దర్యాప్తును ఎంత పకడ్బందీగా చేసామో ఆధారాలను కోర్టు ముందు పెట్టి ఈ స్కాంలో వున్నవారికి శిక్షపడేలా చూస్తామని సీఐడి అధికారులు తెలిపారు

Post Top Ad