సంచలనాన్ని సృష్టించిన రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్ : సోషల్ మీడియా లో ప్రశంశల వెల్లువ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

సంచలనాన్ని సృష్టించిన రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్ : సోషల్ మీడియా లో ప్రశంశల వెల్లువ


హైదరాబాద్  రోడ్డుపై యాక్సిడెంట్ జరిగిన ఓ యువతిని చూసి, వెంటనే తన కాన్వాయ్   ఆపి తన కారులో ఉన్న ప్రాథమిక చికిత్స పెట్టె తీసుకొని, ఆ యువతికి తానే మందు రాసి కట్టుకట్టారురాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్. ఇలా మానవత్వంలో ముందున్న వాళ్లని నెటిజన్లు పొగడ్తలతో ముంచేత్తుతారు. సీపీ విషయంలోనూ ఇదే జరిగింది. మహేశ్ భగవత్ చేసిన సాయానికి నెటిజన్లు అభినందిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం నేరేడ్‌మెట్‌లో ఉంది. ఒక పని నిమిత్తం కమిషనర్ నాగారం నుంచి ఈసీఎల్ వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో నాగారం వద్ద పెద్ద ఎత్తున జన సంచారం ఉంది. దీంతో మహేశ్ భగవత్ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించి వేశారు. తన కారు నుంచి కిందికి దిగారు. అక్కడ అప్పుడే ఒక మోటర్ బైక్ పై వెళ్తున్న యువతికి యాక్సిడెంట్ జరిగింది. ఆ యువతి రోడ్డు పైన పడి ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర స్థాయిలో రోదిస్తుంది.ఇది చూసిన మహేశ్ భగవత్ ఒక్కసారిగా చలించి పోయాడు. వెంటనే తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ని తీసుకొచ్చి.. యువతికి ప్రాథమిక చికిత్స చేశాడు. అక్కడి నుంచి నేరుగా తన కారులోనే పక్కనే ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అక్కడి నుంచి తిరిగి తన కార్యాలయానికి మహేశ్ భగవత్ వెళ్ళిపోయారు. ఈ వ్యవహారాన్ని అందరూ ఫోటోలు తీసి, స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేశ్ భగవత్ చేసిన పనిని పొగడ్తలతో ముంచెత్తారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )