తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోంది : బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 20, 2020

తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోంది : బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లనుందని మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. ఆయన గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ..‘ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి నూతన అధ్యక్షులు రాబోతున్నారు. ఎవరు అధ్యక్షుడు అయినా అందరిని కలుపుకుని ముందుకు వెళతాం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నయ రాజకీయ శక్తిగా అవతరించాం. అలాగే ఏపీలోనూ త్వరలో మార్పులు రాబోతున్నాయి. తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోంది. సీఏఏలో ఎలాంటి ఇబ‍్బందులు లేనప్పటికీ రాజకీయ అవసరాల కోసమే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లీస్‌లు వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టికల్‌ 370, రామ మందిరం, ట్రిపుల్‌ తలాక్‌ వంటి అంశాలలో ప్రధాని మోదీకి వస్తున్న ఆదరణ చూడలేకే సీఏఏపై వివాదం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆలోచనలు దేశానికే నష్టం కలిగించేలా ఉన్నాయి. వీటిని అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )