విద్యార్థులకు జరిమాన విధించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

విద్యార్థులకు జరిమాన విధించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

జనవరిలో జరిగిన షాహీన్‌బాగ్ నైట్ కార్యక్రమానికి రాత్రి 9 తర్వాత అనుమతి లేదని పాలనావిభాగం చెబుతోంది. అయినప్పటికీ జరిమానా విధించబడ్డ ముగ్గురు విద్యార్థులు కార్యక్రమంను పొడిగించారని చెబుతోంది. అంతేకాదు యూనివర్శిటీ క్యాంపస్ గోడలపై రంగులతో పెయింటింగ్‌లు వేశారని పాలనా విభాగం పేర్కొంది. యూనివర్శిటీ యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించినందుకు ముగ్గురు విద్యార్థులు ఫసీ అహ్మద్, సహానా ప్రదీప్ మరియు అదీష్‌లపై ఒక్కొక్కరికీ రూ.5వేలు జరిమానా విధించినట్లు అడ్మిన్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. నోటీసులు ఇచ్చిన 10 రోజుల్లోగా ఈ జరిమానా విధించాలని చెబుతూ మంగళవారం నోటీసులు జారీ చేయడం జరిగింది.మరోసారి క్యాంపస్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉంటాయని నోటీసుల్లో పేర్కొంది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ చదువుపై దృష్టి సారించాలని నోటీసుల్లో యూనివర్శిటీ పాలనావిభాగం సూచించింది. మరోసారి ఇలాంటి చర్యలకు దిగితే దీని పర్యవసనాలు ఏకంగా అకాడెమిక్ కెరీర్‌పై పడుతుందని ఆ విధమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక యూనివర్శిటీ పాలనా విభాగం విధించిన జరిమానా నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )