అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో ముచ్చటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో ముచ్చటించిన తెలంగాణ సీఎం కేసీఆర్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ కి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లోని  విందు ఏర్పాటు ,  దీనికి తెలంగాణసీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన విందు భేటీలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ విందు సమావేశానికి అతిథులుగా ఆహ్వానించగా ఆ జాబితాలో కేసీఆర్‌ కూడా ఉన్నారు. డొనాల్డ్‌ ట్రంప్, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌ అతిథులను పరిచయం చేసుకుంటూ వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారితో కరచాలనం చేసి తనను పరిచయం చేసుకున్నారు. డొనాల్డ్‌ ట్రంప్, మెలానియా ట్రంప్‌ వెంట రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష, ప్రధాని నరేంద్ర మోదీ అతిథులను పలకరిస్తూ ముందుకు సాగారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )