అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన కు మేం వ్యతిరేఖం : సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 24, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన కు మేం వ్యతిరేఖం : సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు రెండో రోజు ఆదివారం జరిగాయి. ఆయన మాట్లాడుతూ.. అమెరికా రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆ భారాన్ని ఇతర దేశాలపై మోపడానికి ట్రంప్‌ భారత పర్యటనకు వస్తున్నారన్నారు. ట్రంప్‌ పర్యటన ఎలా ఉందంటే మీ ఇంటికొస్తే ఏమిస్తావు.. మా ఇంటికి ఏమి తెస్తావ్‌ అనేలా ఉందన్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )