తెలంగాణ లో పర్యటించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

తెలంగాణ లో పర్యటించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు శనివారం శంషాబాద్‌ విచ్చేయనున్నారు. ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన, కానీ ఈ సమయంలోనే తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుల నియామకం లో కీలక పాత్ర పోషించనున్నారు ఉప రాష్ట్రప్రతి వెంకయ్య నాయుడు . పలువురు నాయకులతో చర్చించే అవకాశం ఉంది . ఈ సరి తెలంగాణ అధ్యక్షుడి రేసులో ఉన్న  బండి సంజయ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి . తెరాస కి కరీంనగర్ లో గట్టి పోటీ ఇస్తూ యువత , జిల్లా ప్రజలలో మంచి ఆదరణ ఉంది ఈ విషయం పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది . అదే విధంగా వీటికంటే ముందు హైదరాబాద్ కి రాగానే ,  రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ పరిధిలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో శనివారం ఉదయం జరుగనున్న యశోద దవాఖాన ఉచిత వైద్య శిబిరం, పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారని ట్రస్టు అధికార వర్గాలు తెలిపాయి.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )