అసెం‍బ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 28, 2020

అసెం‍బ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్  తెలుగు రాష్ట్రాలలో పర్యటించారు . ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసారు . తెలుగు రాష్ట్రాల్లో అసెం‍బ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై స్పష్టత ఇచ్చారు. దేశమంతటా అసెంబ్లీ సీట్ల పెంపు జరిగినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ సీట్లను పెంచడానికి అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు. అందుకు పార్లమెంట్‌ చట్టాలు కూడా అనుమతించవని పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెం‍బ్లీ సీట్ల పెంపు చేపడుతారని తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాలకులు ఏపీ విభజన చట్టంలో ఇష్టమొచ్చినట్లు అనేక అంశాలు పెట్టారని వ్యాఖ్యానించారు. దేశంలో సీట్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై న్యాయ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )