హైదరాబాద్‌లోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ విడుదల చేసిన ఆ ప్రకటనను బాలాపూర్‌లోని చంద్రాయణ్ గుట్ట రోడ్డులోగల మెగా గార్డెన్ ఫంక్షన్ హాలు ప్రహరీకి అంటించారు. ఈ ప్రకటన ప్రకారం.. ‘‘ప్రస్తుతం వీరి విచారణను రద్దు చేస్తు్న్నాం. తదుపరి చర్య ఎప్పుడనేది విచారణకు హాజరు కావాల్సిన వారికి ఇప్పటికే స్పీడ్ పోస్టులో వివరాలు పంపాం’’ అని పేర్కొన్నారు.తెలంగాణ లో నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులు పొందారనే అరోపణలపై యూఐడీఏఐ హైదరాబాద్‌లో 127 మందికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన పత్రాలతో తమ పౌరసత్వం నిరూపించుకుంటే ఆధార్ కొనసాగుతుందని, లేదా దాన్ని రద్దు చేస్తామని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే, తాజాగా ఆ విచారణను రద్దు చేశారు. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )