నారాయణ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్య పై స్పందించిన మంత్రి కేటీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

నారాయణ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్య పై స్పందించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ శివారు వెలిమేల గ్రామంలోని నారాయణ కాలేజీలో సంధ్యారాణి అనే విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో ఆమె తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సంధ్యారాణి అక్కడే ఉరేసుకుంది. తల్లిండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రి వద్దకు వచ్చారు. కుమార్తె మరణవార్త విని బోరుమన్నారు. కాలేజీ వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అందరూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు తీసుకెళ్లాలని నిర్ణయించారు. వారు అటువైపు వెళ్తుండగా, ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మృతురాలి తండ్రిని ఓ పోలీస్ కానిస్టేబుల్ బూటు కాలితో డొక్కలో తన్నాడు. ఈ దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.దీన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు. సంధ్యారాణి తండ్రిపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్‌ తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో హోంమంత్రి మహమూద్ అలీని కూడా ట్యాగ్ చేశారు. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అధికారులు అండగా నిలవాలని కేటీఆర్‌ తెలిపారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )