తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది : కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 18, 2020

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది : కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అవమానపరుస్తోందని, అసలు దాంతో ఎలాంటి ఇబ్బందీ లేదని కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ అన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు వ్యతిరేకించలేవని సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కూడా గతంలో అన్నారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.కేసీఆర్‌పై కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి తొత్తుగా కేసీఆర్ మారారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇస్తున్న సూచనల మేరకే ఆయన మెప్పు కోసం కేసీఆర్ మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసమే ముస్లింలకు కేసీఆర్ 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని టైమ్ స్క్వేర్ హోటల్‌లో కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.1951లో పాకిస్థాన్‌లో 23 శాతం ఉన్న మైనార్టీలు ఇప్పుడు 3 శాతారని పడిపోయారని తెలిపారు. ‘‘వీరంతా ఎక్కడికెళ్లారు? అందరూ చచ్చిపోయారా? లేక ఇస్లాం మతం పుచ్చుకున్నారా? లేదా వారు మన దేశంలోకి చొరబడ్డారా? ఇలా అక్కడ మతపరమైన వేధింపులు, హింసకు గురై మన దేశంలోకి వచ్చిన వారందరికీ నీడనిచ్చి పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతోనే మేం ఉన్నాం.’’ అని పీయుశ్ గోయల్ తేల్చి చెప్పారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )