తెలంగాణకి రానున్న ప్రైవేట్ రైల్వే , పెట్టుబడుల కోసం ప్రభుత్వ ఆహ్వానం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

తెలంగాణకి రానున్న ప్రైవేట్ రైల్వే , పెట్టుబడుల కోసం ప్రభుత్వ ఆహ్వానం

తెలంగాణకి రానున్న ప్రైవేట్ రైల్వే , పెట్టుబడుల కోసం ప్రభుత్వ ఆహ్వానం .  ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించటం కోసం, అలాగే వారి ప్రయాణ అవసరాలు తీర్చటం కోసం రైల్వే లో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తుంది కేంద్ర సర్కార్ . ఇక ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వేలో ప్రైవేట్‌ రైళ్ల రాకపోకలకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వంద మార్గాల్లో 150 ప్రైవేట్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో ఏపీకి సంబంధించి ఐదు రూట్లు ఉన్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉన్న రూట్లనే రైల్వే శాఖాధికారులు ప్రైవేటు రైళ్ల నిర్వహణకు ఎంపిక చేశారు. చర్లపల్లి - శ్రీకాకుళం, గుంటూరు - లింగంపల్లి, లింగంపల్లి - తిరుపతిల మధ్య డైలీ ట్రైన్లు నడపనున్నారు. ఇక విజయవాడ - విశాఖతో పాటూ, విశాఖ - తిరుపతి మధ్య ట్రై వీక్లీ ప్రైవేట్‌ రైళ్లు నడిపేందుకు సిద్దం అవుతున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )