నిర్భయ నిందితుడి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చమని పిటిషన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 28, 2020

నిర్భయ నిందితుడి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చమని పిటిషన్

దేశ వ్యాప్తంగా దిగ్బ్రాంతికి గురి చేసిన నిర్భయ హత్యాచార కేసులో దోషి పవన్‌ గుప్త సుప్రీం కోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చమని పిటిషన్‌లో కోరాడు.  ట్రయల్‌ కోర్టు ఇచ్చిన డెత్‌వారెంట్‌పై స్టే విధించమని అతడి తరపు లాయరు పిటిషన్‌ దాఖలు చేశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులు ఒకరి పతరువాత ఒకరు ఏదో ఒక సాకుతో ఉరిశిక్ష అమలు కాకుండా కాలయాపన చేస్తున్న విషయంతెలిసిందే.  పవన్‌ గుప్త ఇప్పటి వరకు ఎలాంటి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోలేదు. రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ కూడాచేసుకోలేదు . ఈ కేసులో మిగతా ముగ్గురు (ముకేశ్‌ కుమార్‌, వినయ్‌ కుమార్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌) ఇప్పటికే రాష్ట్రపతికి క్షమాబిక్ష కోసం దరఖాస్తు పెట్టకున్నారు. అది తిరస్కరించడమూ జరిగింది. మార్చి ౩న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులనూ ఉరితీసేందుకు ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసారు . కానీ పవన్‌ గుప్తా క్యూరేటివ్‌ పిటిషన్‌ వేయడంతో ఉరితీత మరోసారి ఆలస్యమయ్యేవాయిదా పడే అవకాశంఉంది .( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )