తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం వల్లే ఎంఎంటీఎస్‌ ప్రాజెక్ట్ నిలిచింది : కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం వల్లే ఎంఎంటీఎస్‌ ప్రాజెక్ట్ నిలిచింది : కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పీయూష్‌ గోయల్‌ల పరస్పర విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల కేటాయింపుల్లో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా విస్మరించిం దని తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఆరోపించారు. బడ్జెట్‌లో దక్షిణ భారతదేశానికి అతి తక్కువ నిధులను కేటాయించిందన్నారు. అనంతరం పీయూష్‌ మాట్లాడుతూ.. కేంద్రానికి ఏ ఒక్క రాష్ట్రం పట్ల ప్రత్యేక అభిమానం ఉండబోదని.. అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా ప్రారంభించిన ఎంఎంటీఎస్‌ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.450 కోట్లు ఇవ్వకపోవడం వల్లనే పనులు నిలిచిపోయినట్లు పీయూష్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, సీఎం రమేష్, రఘురామ కృష్ణంరాజు, పి.రంగయ్య, ధర్మపురి అరవింద్, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా, ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.   
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )