ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేసిన అసదుద్దీన్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 16, 2020

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేసిన అసదుద్దీన్‌


వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అసదుద్దీన్‌కు కొత్తేమీ కాదు! తరచూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడుతుంటారు. అంతేకాక, ఇటీవల ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీ, సీఏఏ విషయంలో బీజేపీపై మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒవైసీ తాజాగా కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, ఆయన స్పందనపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు నేర్పిస్తామని తేల్చి చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపినా సరే వెళ్తామని అన్నారు. తాను 25 ఏళ్లుగా భద్రత లేకుండానే తిరుగుతున్నానని, చంపాలనుకుంటే చంపేయొచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను తన చెప్పుతో తొక్కుతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్బర్గలో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )