జిల్లా కేంద్ర సహాకర బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నేడు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

జిల్లా కేంద్ర సహాకర బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నేడు

డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలకు ఆయా సంఘాల ఎన్నికల అధికారులు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఫిబ్రవరి 25న డీసీసీబీకి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లకు ఇప్పటికే ఓటింగ్‌కు  ఆహ్వానం పంపారు. ఏక్లాస్‌కు చెందిన 12మంది, బీ క్లాస్‌కు చెందిన మరో నలుగురు డైరెక్టర్లు నేడు ఎన్నికల్లో పాల్గోనున్నారు. ఉదయం 8-30 నిమిషాల వరకు డీసీసీబీ సమావేశ మందిరానికి సదరు డైరెక్టర్లు చేరుకోవాలి. ఎన్నికల అధికారులు డైరెక్టర్ల హాజరు తీసుకుంటారు. 9 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పోటీలో నిలబడే వారికి అధికారులు నామినేషన్‌ పత్రాలు అందజేస్తారు. పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులకు మరో ఇద్దరు చొప్పున ప్రతిపాధికుడు, సెకండర్‌లు సంతకం చేసి, పూర్తి వివరాలు పొందుపరచి అనంతరం ఎన్నికల అధికారికి సమర్పించాలి. డీసీఎంఎస్‌కు సైతం ఇదే విధానం కొనసాగుతుంది. అయితే అక్కడ ఎనిమిది మంది డైరెక్టర్లు మాత్రమే ఉంటారు. నామినేషన్ల స్వీకరణ తరువాత మధ్యాహ్నం 1గంట నుంచి నామ పత్రాలను పరిశీలన చేస్తారు. పోటీ ఉన్న పక్షంలో సీక్రెట్‌ పద్దతిలో బ్యాలెట్‌ పద్దతిన ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగిల్‌ సెట్‌ నామినేషన్‌లు దాఖలు అయినైట్లెతే మధ్యాహ్నం 3గంటల వరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల పేర్లను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )