సంగారెడ్డి నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తండ్రిని బూట్ కాలుతో తన్నిన పోలీస్ కానిస్టేబుల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

సంగారెడ్డి నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తండ్రిని బూట్ కాలుతో తన్నిన పోలీస్ కానిస్టేబుల్

సంగారెడ్డి  నారాయణ కాలేజీలో నిన్న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తండ్రిని కాలుతో తంతున్న పోలీస్ కానిస్టేబుల్.  పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్‌రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కళాశాల యాజమాన‍్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ బుధవారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.  మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్నారు. అంతేకాకుండా మార్చురీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. మృతురాలి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమువుతున్నాయి.దీంతో మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా.. వెలిమేల గ్రామంలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ లో సంధ్యారాణి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సంధ్యారాణి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం నలగండ్లలోని సిటీజన్ ఆసుపత్రికి తరలించారు. 

Post Top Ad