ప్రపంచ ధనికుల జాబితాలో భారీగా చేరిన తెలుగు వారు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 28, 2020

ప్రపంచ ధనికుల జాబితాలో భారీగా చేరిన తెలుగు వారు

 ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాను  హరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనే సంస్థ విడుదల చేసింది . ఈ జాబితాలో మొత్తం 137 మంది భారత్ నుంచి బిలయనీర్లుగా ఉండగా అందులో ఏడు మంది హైదరాబాదుకు చెందిన వారిగా నివేదిక గుర్తించింది. ఏ నివేదిక చూసినా భారత్ నుంచి అగ్రస్థానంలో  రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ  ఉన్నారు . ఇక హైదరాబాద్/ తెలుగు వారిస్థానాలు చుస్తే మేఘ కన్స్‌ట్రక్షన్స్‌కు చెందిన మేఘ కృష్ణారెడ్డి కూడా ఈ సారి జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన 1067వ స్థానం దక్కించుకున్నారు. మేఘా కృష్ణారెడ్డి ఆస్తుల విలువ 1.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మేఘా కృష్ణారెడ్డితో పాటుగా అరబిందో ఫార్మా సహవ్యవస్థాపకులు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. రాంప్రసాద్‌ రెడ్డి ఆస్తుల విలువ కూడా 1.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు 1.5 బిలియన్ అమెరికా డాలర్లతో 2000 స్థానంలో ఉన్నారు.డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ కూడా ఈ సారి జాబితాలో కొత్తగా చేరింది. ఈ సంస్థకు చెందిన జీవీ ప్రసాద్ మరియు జీ అనురాధాలు 1 బిలియన్ అమెరికా డాలర్లతో 2642వ స్థానంలో నిలిచారు. 2019లో భారత్ నుంచి 33 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )