నల్లగొండ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ : అధికారులు పై అగ్రహం వ్యక్తం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

నల్లగొండ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ : అధికారులు పై అగ్రహం వ్యక్తం

పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నేడు  నల్గొండ జిల్లాలో పర్యటించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . దేవరకొండ మున్సిపాలిటీ పైన పటారం లోన లొటారం అన్నట్టు వుందన్నారు. ఎక్కడి చెత్త అక్కడే ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు, చైర్మన్ , కమీషనర్ పై అసహనం వ్యక్తం చేశారుఇక పొడి, తడి చెత్తను వేరుచేయడానికి 8 వేల ఇళ్లల్లో ప్రతి ఇంటికి రెండు డబ్బాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు పరిచయం కార్యక్రమంతో సిబ్బందితో ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.దేవరకొండ మున్సిపాలిటీలో పరిస్థితి బాగా మెరుగుపడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం కేవలం పచ్చదనం కోసమే వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు . 80 శాతం మొక్కలు బతికించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )