హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2020

హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హై-క్లాస్ గ్లాస్ గ్యాస్ గోదాంలో ఈ ప్రమాదం తలెత్తింది. కెమికల్‌ గోదాముకూ మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గోదాంలో గ్యాస్‌ సిలిండర్లు లీక్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రత ఎక్కువ కాకుండా అగ్ని మాపక సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే తొలుత సమాచారం అందుకున్న మలక్ పేట్ అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తేవడానికి శ్రమించాయి. మంటలకు గల కారణాలను అంచనా వేసి అగ్ని మాపక సిబ్బంది తగిన విధంగా ఆర్పేందుకు ఆలోచన చేశారు. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు గోదాం యజమానులను ప్రశ్నిస్తున్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )