రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అవకాశం కోసం పలువురు టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రిటైరవుతున్న పార్టీ పార్లమెంటరీ నేత కేకే మరోమారు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి చెందిన మాజీ ఎంపీ కవిత పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. వీరితో పాటు గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ అవకాశం దక్కని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మందా జగన్నాథం, ప్రొఫెసర్ సీతారాంనాయక్‌తో పాటు ఇతరులు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్నా అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు లేకపోవడంతో తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. మరోవైపు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన వారి పేర్లను పరిశీలనకు తీసుకోకపోవచ్చనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )