పట్టణ ప్రగతిలో పలు కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

పట్టణ ప్రగతిలో పలు కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు

పట్టణ ప్రగతిలో పలు కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు .  ప్రతిష్ఠాత్మక జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఏడాదిలోపే ఉండటంతో కేటీఆర్‌ నగరంలోని అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు చేపడుతున్నారు. ప్రైవేటు సంస్థలకు నిర్మాణ కాంట్రాక్టులు ఇస్తే పరిస్థితి మెరుగవుతుందనుకుంటే ఇంత అధ్వానమా? అని ప్రశ్నించారు. ‘మీ వల్ల అయితే చేయండి.. లేదంటే వదిలేయండి.. ఇక తెలంగాణలో ఎక్కడా పనులు చేయలేరు’ అంటూ కాంట్రాక్టర్లను హెచ్చరించారు. జాప్యాలకు గల కారణాలు తనకు చెప్పొద్దని.. తుది దశలో ఉన్న పనులు మే నాటికి, పురోగతిలో ఉన్నవి అక్టోబరుకు పూర్తి చేయాలని అధికారులను ఫైనల్‌గా ఆదేశించారు. కాంట్రాక్టర్‌కు మంత్రి కేటీఆర్ కీలకమైన, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణాల విషయంలో పక్కాగా ఉండాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ‘చైనాలో 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించారు. మన వద్ద వంతెన లేదా రోడ్డు నిర్మించాలంటే ఏళ్లు పడుతోంది. గుంతల రహదారులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.’ అని అసహనం అని కేటీఆర్ వ్యక్తం చేశారు. రహదారుల పరిస్థితి మెరుగుకు ఉద్దేశించిన సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ)పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకటి, రెండు సంస్థలు ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )