శివ దీక్ష తో శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు. .. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

శివ దీక్ష తో శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు. ..వికారాబాద్ జిల్లా ప్రతినిధి :చిన్నారులు సైతం శివ మాల ధారణ బయల్దేరారు   మోమిన్పేట నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర
శివనామస్మరణం తో  మార్మోగిన  మోమిన్ పేట
సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో దైవభక్తి కలిగి ఉండాలని మానవ సేవే మాధవ సేవగా తన వంతు సహకారం దైవ దర్శనాలు ఖర్చు చేయాలని . 


భక్తి శ్రద్ధలతో  పూజిస్తే తే దైవం ఎప్పుడూ తన వెంటే ఉంటుందని శివ స్వాములు పేర్కొన్నారు మండల కేంద్రంలోని మాణిక్య ప్రభు మందిరం ప్రారంభమైన శివ స్వాముల యాత్ర మండల కేంద్రంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామస్తులు అందరి హారతులు పూల వర్షాలతో శివ స్వాముల వారికి వీడ్కోలు పలికారు నేడు మోమిన్ పేట మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శుక్రవారం నాటికి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకొని దీక్షలు విరమించి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి తిరిగి వస్తారని వివరించారు 40 రోజుల పాటు గతంలో దీక్షలతో పాల్గొన్న స్వాములు గ్రామానికి మంచి జరుగుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు స్వాముల వారికి ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పూజారులు కృష్ణయ్య పంతులు రఘునందన్ రావు మాజీ సర్పంచ్ చంద్రయ్య టిఆర్ఎస్ నాయకులు మహంత్ స్వామి కుమారస్వామి వీరేశం స్వామి రమేష్ స్వాములు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.