రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎలక్షన్ కమీషన్ వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎలక్షన్ కమీషన్ వెల్లడి


రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర  ఎలక్షన్ కమీషన్ వెల్లడి . 17 రాష్ట్రాలకు సంబంధించి 55 మంది సభ్యుల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయా స్థానాల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 9న ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2, అసోం నుంచి 3, బిహార్‌ నుంచి 5, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 2, గుజరాత్‌ నుంచి 4, హరియాణా నుంచి 2, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి 1, జార్ఖండ్‌ నుంచి 2, మధ్యప్రదేశ్‌ నుంచి 3, మణిపూర్‌ నుంచి 1, రాజస్తాన్‌ నుంచి 3సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. ఏప్రిల్‌ 2న మహారాష్ట్ర నుంచి 7, ఒడిశా నుంచి 4, తమిళనాడు నుంచి 6, పశ్చిమ బెంగాల్‌ నుంచి 5 సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది.  అలాగే ఏప్రిల్‌ 12న మేఘాలయ నుంచి ఒక సభ్యుడి పదవీకాలం పూర్తవుతుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )