భారీగా పేరుగనున్న పెట్రోల్ , డీజిల్ ధరలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 28, 2020

భారీగా పేరుగనున్న పెట్రోల్ , డీజిల్ ధరలు

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిఎస్ - 6 వాహనాలు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అమ్మకాలు మొదలవుతున్నాయి . బిఎస్ - 6 వాహనాలు తప్ప మిగితా వాహనాలు తయారీకి అనుమతులు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం .  ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఎస్‌-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలను ప్రముఖ కంపెనీలు గడువుకు ముందే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగానే దేశీయంగా ఉన్న అన్ని చమురు పంపిణీ సంస్థలు బీఎస్‌-6 ఇంధనాన్ని మాత్రమే సరఫరా చేసేందుకు సన్నద్ధమయ్యాయి. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే బీఎస్‌-6 ఇంధనాలను ఏప్రిల్‌ 1 నుంచి సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చమురు దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) శుక్రవారం వెల్లడించింది. తక్కువ స్థాయిలో సల్ఫర్‌ ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ను ఉత్పత్తి చేసేందుకు తమ రిఫైనరీలను రూ.17వేల కోట్లతో అప్‌గ్రేడ్‌ చేశామని దేశంలోనే అతిపెద్ద చమురు పంపిణీ సంస్థ ఐఓసీ ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడించారు.  దేశం మొత్తం కొత్త ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని వాడనుండటంతో ఏప్రిల్‌ 1 నుంచి ఇంధన ధరలు స్వల్పంగా పెరిగా అవకాశం ఉన్నదని తెలిపారు. ఐతే ఎంతమేర ఆయిల్‌ రేట్లు పెరుగుతాయనే విషయాన్ని ఆయన చెప్పలేదు. ప్రస్తుత బీఎస్‌-4 ఇంధనంతో పోలిస్తే బీఎస్‌-6 ఇంధనంలో కేవలం తక్కువ మోతాదులో  సల్పర్‌  ఉంటుందని పేర్కొన్నారు. ఐతే భారీ స్థాయిలో ఆయిల్‌ ధరలు పెంచి వినియోగదారులపై భారం వేయబోమని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ చమురు సంస్థలు తమ రిఫైనరీలను ఆధునీకరించేందుకు సుమారు 35వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాయని వివరించారు. 




( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )