తెలంగాణాలో త్వరలో పెరుగనున్న విద్యుత్హు చార్జీలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

తెలంగాణాలో త్వరలో పెరుగనున్న విద్యుత్హు చార్జీలు

తెలంగాణ లోని  విద్యుత్తు సంస్థలు విద్యుత్తు చార్జీలు పెంచాలని సుదీర్ఘంగా ప్రభుత్వానికి నివేదికలు , విన్నపాలు చేస్తూ వచ్చింది , ఎట్టకేలకు ప్రభుత్వం కరెంటు బిల్లులు  పెంచే ఆలోచనకి వచ్చింది. కొత్త ఛార్జీలు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి విద్యుత్‌ శాఖపై ప్రగతి భవన్‌లో శుక్రవారం సమీక్ష జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌కు 0.19 పైసల చొప్పున లోటు ఉందని, ప్రభుత్వ రాయితీతో డిస్కమ్‌లు మనగలగడం కష్టమని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు చెప్పారు.కొత్త టారిఫ్‌ ప్రతిపాదనలను రూపొందిస్తే చర్చించి, ఛార్జీలపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రస్తుతం డిస్కమ్‌లు వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రూ.13,647 కోట్ల దాకా బకాయి ఉన్నట్లు కేసీఆర్‌కు నివేదించారు. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌సీ) విధానం అమలుతో ఏ వారం కరెంటు కోసం ఆ వారానికి సరిపడా డబ్బులు ముందే కడుతున్నామని గుర్తు చేశారు. కరెంట్‌ చార్జీలను సవరించకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
'

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )