ట్విట్టర్ వేదికగా అసదుద్దీన్ ఒవైసీ త్రివమైనా ట్వీట్ వార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2020

ట్విట్టర్ వేదికగా అసదుద్దీన్ ఒవైసీ త్రివమైనా ట్వీట్ వార్

హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలనాత్మక ట్వీట్ చేశారు. ఓ వ్యక్తిపై చోటు చేసుకున్న మూకదాడులకు సంబంధించిన రెండు ఫొటోలను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాటిని షేర్ చేశారు. ఫొటోలకు జత చేశారు.దీని అంతరార్థం పౌరసత్వ సవరణ కి వ్యతిరేకం తెలపడమే అని అని ఊహ గానాలు వినిపిస్తున్నాయి .    దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలో చోటు చేసుకుంటోన్న హింసాత్మక పరిస్థితులు, మూకదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు అవి విస్తరిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా న్యూఢిల్లీకి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానితో పాటు ఉత్తర ప్రదేశ్‌లో భారీగా హింసాత్మక ఘటనలు నమోదు కావడం, ఏకంగా అయిదుమంది దుర్మరణం పాలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించినప్పటికీ.. అవి తగ్గుముఖం పట్టలేదు.




( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )