టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ కి అవమానం ...... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 24, 2020

టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ కి అవమానం ......

తెలంగాణ రాష్ట్రంలోని  చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. టోల్‌ ఫీజు చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని టోల్‌ ప్లాజా సిబ్బంది అడ్డు​కుంది. తాను ఎమ్మెల్సీ అని చెప్పినా అనుమతించలేదు. చివరికి ఐడీ కార్డు చూపించినా వదల్లేదు. మొదట గన్‌మెన్‌ లేకపోవడంతో ఎమ్మెల్సీ అని అనుకోలేదని చెప్పిన సిబ్బంది.. తర్వాత టోల్‌​ మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాహనాన్ని అనుమతించారు. కాగా, టోల్‌ ప్లాజా సిబ్బంది తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ధర్నాకు దిగారు. ఏ ఎమ్మెల్సీని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో చెప్పాలంటూ టోల్ ఫ్లాజా వద్ద బైఠాయించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )