మేకవనం పల్లి ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలలో టిఆర్ఎస్ హవా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 16, 2020

మేకవనం పల్లి ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలలో టిఆర్ఎస్ హవా


మేకవనం పల్లి ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి, జిల్లా టిఆర్ఎస్ నాయకుడు అంజి రెడ్డి స్థానాన్ని పదిలం చేసేందుకు  అధిష్టానం పావులు కదుపుతున్నారు.  పూర్తిస్థాయి మెజార్టీ  దక్కడంతో ఎలాగైన  స్థానాన్ని దక్కించుకుని జిల్లాలో డీసీఎంఎస్ లేదా డి సి సి బి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని జిల్లాస్థాయిలో పోటీ పడాలని భావిస్తున్నారు. మేకవనంపల్లి సహకార సంఘంలో ఎన్నికల వార్డు సభ్యులు పేర్లు ఇలా ఉన్నాయి.  ఒకటో వార్డు రాజు రెండో వార్డు శేఖర్, మూడో వార్డు అంజిరెడ్డి, నాలుగో వార్డు సోమిరెడ్డి, ఐదవ వార్డు సువర్ణ, ఆరవ వార్డు సుదర్శన్ రెడ్డి, ఏడవ వార్డు బాగయ్య, 8వ వార్డు వినయ్ కుమార్, 9 వార్డు గోపాల్ రెడ్డి, 10 వార్డు మల్లయ్య ,11వ వార్డులో పార్వతమ్మ ,12వ వార్డు BANSHA,  13వ వార్డు పోచమ్మ ఎన్నికయ్యారు.  ఎన్నికల అనంతరం  ఎన్నికల అధికారులు సంధ్య పిఎసిఎస్ సీఈఓ బాలకృష్ణయ్య విజేతలకు ఎన్నికల పత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా   జడ్పీ వైస్ చైర్మన్   విజయ్ కుమార్ ఆర్ టి ఆర్ ఎస్ జిల్లా నాయకుడు డీ లక్ష్మయ్య నాయకులు గ్రామ సర్పంచులు  వారిని అభినందించారు.