రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన : కలెక్టర్ తో ప్రత్యేక భేటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 20, 2020

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన : కలెక్టర్ తో ప్రత్యేక భేటీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన జరిపారు. సిరిసిల్ల పట్టణంలోని SC బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బాలికలను వేధింపులకు గురిచేసిన పార్టీ నాయకులను సస్పెండ్ చేశాం. ఇలాంటి దురాగతాలకు పాల్పడే ఘటనలపై అమ్మాయిలు గొంతెత్తాలి. అమ్మాయిలను వేధించిన దేవయ్యపై కఠిన చర్యలు తీసుకుంటాం. వసతిగృహాల్లో రక్షణచర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాం. ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ శిబిరాన్ని చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )