ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు,హింసను తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాదులో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు,హింసను తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాదులో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు

ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్లు,హింసను తీవ్రంగా ఖండిస్తూ  హైదరాబాదు లో  నిన్న రాత్రి పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఢిల్లీ పోలీసులు నిరసనకారులపై వ్యవహరించిన తీరును ఖండించారు. టోలీచౌకి, సెవెన్ టూంబ్స్‌ రోడ్, కింగ్ కోటీ, యాకుత్‌పురాల్లో క్యాండిల్ లైట్ నిరసనలు జరిగాయి. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కువగా మహిళలే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ పోలీసులు అరాచకత్వాన్ని నిరసనల్లో పాల్గొన్న మహిళలు ఖండించారు. అంతేకాదు సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీల అమలును కేంద్రం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఇదిలా ఉంటే నెక్లెస్‌రోడ్‌ మీదుగా హుస్సేన్‌సాగర్ వైపునకు క్యాండిల్ లైట్ మార్చ్ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో పాల్గొన్న పలువురు కార్యకర్తలు ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబడుతూ అదే సమయంలో ఒక వర్గం వారు వ్యవహరించిన తీరును ఖండించారు. ఇక నెక్లెస్ రోడ్ నుంచి హుస్సేన్ సాగర్‌ వరకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతం మొత్తం రాత్రి 9 గంటలలోపే ఎడారిని తలపించింది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )