నాంపల్లి కోర్టు కి హాజరైన మాజీ ఎంపీ కవిత : - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

నాంపల్లి కోర్టు కి హాజరైన మాజీ ఎంపీ కవిత :


తెలంగాణ :  2010లో నిజామాబాద్ ఉప ఎన్నికల సమయంలో కవిత ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో అప్పటి నిజామాబాద్ ఎస్పీ కార్యాలయం ఎదుట కవిత టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. అయితే సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్న సమయంలో ధర్నా చేయడం నిషేధమని కవిత, మోపినేని నిర్మల, బీజేపీ నేత ఝాన్సీ రాణి, జుగల్ కిషోర్‌పై ఐపీసీ 341, 188 సెక్షన్ల కింద ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. . ఏ-2గా ఉన్న మోపినేని నిర్మల, ఏ-4గా ఉన్న జుగల్ కిషోర్ కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో కేసును తదుపరి విచారణ కోసం మార్చి 19కి న్యాయమూర్తి వాయిదా వేశారు. కల్వకుంట్ల కవిత కోర్టుకు హాజరవుతున్నారని తెలిసి, నాంపల్లి కోర్టుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. కోర్టు హాలులోకి ప్రవేశించేందుకు వారంతా ప్రయత్నించడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. పోలీసులు కలగజేసుకొని వారిని అదుపు చేశారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )