జేబీఎస్, ఎంజీబీఎస్‌ మెట్రో మార్గంని ప్రారంభిచిన సీఎం కెసిఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 07, 2020

జేబీఎస్, ఎంజీబీఎస్‌ మెట్రో మార్గంని ప్రారంభిచిన సీఎం కెసిఆర్జేబీఎస్, ఎంజీబీఎస్‌ మెట్రో మార్గం ప్రారంభమైంది.సీఎం కేసీఆర్ శుక్రవారం (ఫిబ్రవరి 7) సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు జేబీఎస్ వద్ద ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. కీలకమైన ఈ మార్గం ప్రారంభంతో L&T మెట్రో మొదటి దశలో 72 కి.మీ.లకు గాను 69 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా అవతరించింది. ఇప్పటికే ప్రయాణికుల విశేష ఆదరణ పొందుతున్న హైదరాబాద్ మెట్రో ఇకపై సరికొత్త రికార్డులు నెలకొల్పనుంది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )