కొత్త పథకాలు తీసుకురానున్న తెరాస సర్కార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 28, 2020

కొత్త పథకాలు తీసుకురానున్న తెరాస సర్కార్

తెరాస పార్టీ అధినేత మరిన్ని పథకాలు ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు. సమయానుకూలంగా కొత్త పథకాలు ప్రకటిస్తామని గతంలోనే ఆయన ప్రకటించారు. ఆ పథకాలు కూడా ప్రకటిస్తే.. రాష్ట్రంలో ఇప్పటికే కుదేలైన ప్రతిపక్షాలు ఇక ఉనికే లేకుండా పోతాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అమ్ములపొదిలో కీలక పథకాలు అనేకం ఉన్నాయని.. సమయానుకూలంగా వాటిని ప్రవేశపెడతామని అటు టీఆర్‌ఎస్ నేతలు కూడా గర్వంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దశల వారీగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మరిన్ని కీలక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది.ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు అంబులెన్స్‌లు అందజేయనున్నట్లు మంత్రి గంగుల చెప్పారు. ఐదుగురు యువతకు ఒక గ్రూప్‌గా అంబులెన్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. 11 సమాఖ్యల ద్వారా వివిధ వృత్తుల వారికి ఆయా రంగాల్లో ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీసీ విద్యార్థుల భవిష్యత్‌ కోసం అధికారులు సమష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు వసతి గృహాలను సందర్శించాలని మంత్రి సూచించారు. సంక్షేమ వసతి గృహాల ప్రగతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )