ఇంటర్ విద్యార్థిని సంధ్యరాణి తండ్రిని కాలితో తన్నిన పోలీస్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

ఇంటర్ విద్యార్థిని సంధ్యరాణి తండ్రిని కాలితో తన్నిన పోలీస్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు .....


సంగారెడ్డి  ప్రతినిధి :సంగారెడ్డి  నారాయణ కాలేజీలో నిన్న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తండ్రిని కాలుతో తన్నిన  పోలీస్ కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు . దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ ను సంగారెడ్డి  జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు  అటాచ్ చేస్తూ ఎస్పీ చందన దీప్తి నిర్ణయం తీసుకున్నారు . సంధ్యారాణి  తండ్రితో దురుసుగా ప్రతి ప్రవర్తించిన పఠాన్ చెరువుకు  చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ తీరుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున  తీవ్రంగా చింతిస్తున్నాం.  కానిస్టేబుల్ పై పూర్తిస్థాయి విచారణ జరిపిన తరువాత క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని  ఎస్పీ చందనా దీప్తి  తెలిపారు ....