హైదరాబాద్ మెట్రో అధికారుల తీరును తప్పు పట్టిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 14, 2020

హైదరాబాద్ మెట్రో అధికారుల తీరును తప్పు పట్టిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి


హైదరాబాద్ మెట్రో అధికారుల తీరును తప్పు పట్టిన  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి `. ఇటీవల ప్రారంభించిన JBS-MGBS మెట్రో సర్వీస్ ప్రారంభోత్సవానికి తమను పిలువకపోవడాన్ని తప్పుపట్టారు. మెట్రో ప్రాజెక్టులో కేంద్రం వాటా కూడా ఉందని.. అలాంటప్పుడు తమను అధికారులు ఎలా విస్మరిస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ నడిచే సమయంలో ప్రారంభోత్సవాలు నిర్వహించడం సరికాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల దూరంతో.. మధ్యలో 9 స్టేషన్లతో మెట్రో కారిడార్ పనులు పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టులో కేంద్రం కూడా భాగస్వామ్యంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, తమను ఆహ్వానించలేదని పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మెట్రో అధికారులతో సమీక్షిస్తారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ నేత రాంచందర్ రావు కూడా పర్యటిస్తారు. జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లను పరిశీలిస్తారు( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )