తాళికట్టే ముందు వరుడు నచ్చలేదని వధువు పెళ్ళికి నిరాకరణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

తాళికట్టే ముందు వరుడు నచ్చలేదని వధువు పెళ్ళికి నిరాకరణ

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లిలో జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో తనకు పెళ్లి ఇష్టం లేదని వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామాపురం గ్రామానికి చెందిన నందిని అదే మండలం చర్లపల్లికి చెందిన వెంకటేశ్‌ల పెళ్లి శుక్రవారం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఉదయం 8.10 గంలకు ముహూర్తం ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. తీరా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి నందిని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పింది . దీంతో పెళ్లికి వచ్చినవారందరూఅయోమయానికి లోనయ్యారు . నందినిని ఆమె మేనబావ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఈ వివాహానికి నిరాకరించిందని నిర్ధారణకు వచ్చిన వరుడి బంధువులు వధువు మేనబావపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు వచ్చి, జరిగిన విషయం తెలుసుకుని అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని ఇరు కుటుంబాలకు సర్దిచెప్పటం జరిగింది .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )