వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లపై కేసులు పెట్టిన భారతీయుడు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లపై కేసులు పెట్టిన భారతీయుడు

భారత శాసనాలను ధిక్కరిస్తూ దేశ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్న సోషల్ మీడియా యాప్‌లను నియంత్రించాలని  సామాన్యుడు  శ్రీశైలం డిమాండ్ చేస్తున్నారు. ‘సోషల్ మీడియా గ్రూప్స్‌లో సున్నితమైన, మతపరమైన అంశాలపై ప్రజలను రెచ్చగొడుతున్నారు. సోషల్ మీడియా యాప్‌లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు వేదిక అవుతున్నాయి’ అని శ్రీశైలం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా కొన్ని వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ గ్రూప్‌ల పోస్టింగులను జతచేశారు. శ్రీశైలం పిటిషన్‌ను పరిశీలించిన మేజిస్ట్రేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు రిఫర్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా యాప్స్‌పై కేసు నమోదైనట్లైంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153A, 121A, 124, 124A, 294, 295A, 505, 120B, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66A కింద సోషల్ మీడియా యాప్‌లు ట్విటర్, వాట్సాప్, టిక్ టాక్‌పై కేసు నమోదు చేశారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )