పలు శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ ప్రత్యేక మీటింగ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

పలు శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ ప్రత్యేక మీటింగ్

హైదరాబాద్‌ లో  వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  సమావేశం నిర్వహించారు. శాసనసభ సమావేశాల సన్నద్ధత, రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ... రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై శాఖల వారీగా వివరాలు అందించాలి. వివరాలను మార్చి 4వ తేదీ లోపు సాధారణ పాలనా శాఖకు అందించాలి. జీఏడీ, ఆర్థికశాఖల పరిశీలనకు అనుగుణంగా పోస్టుల వివరాలు ఇవ్వాలి. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం నివేదికపై తదుపరి చర్యలు ఉంటాయి. శాసనసభ సమావేశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమాధానాలు , బడ్జెట్‌ పద్దులు, ఔట్‌ కం బడ్జెట్‌లో సమగ్ర వివరాలు ఉండాలి. ఆయా శాఖలకు సంబంధించి బ్రీఫ్‌ ప్రొఫైల్స్‌ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )