భరత్‌నగర్ బ్రిడ్జ్‌పై నుంచి అదుపుతప్పి కింద పడ్డ కారు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 18, 2020

భరత్‌నగర్ బ్రిడ్జ్‌పై నుంచి అదుపుతప్పి కింద పడ్డ కారు


హైదరాబాద్‌లోని భరత్‌నగర్ బ్రిడ్జ్‌పై నుంచి కారు అదుపుతప్పి ప్రశాంత్ నగర్‌వైపు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికివచ్చి.. సహాయ కార్యక్రమాలుచేసి .. స్థానికుల సాయంతో క్షతగాత్రుల్ని హుటా హుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని సోహెల్‌గా గుర్తించారు. క్షతగాత్రులు బోరబండ పండిట్ నెహ్రూ నగర్ కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.కారు దాదాపు 30 అడుగులు పై నుంచి కిందపడటంతో భారీగా డ్యామేజీ అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జి కింద ఎక్కువమంది జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )